హంపీ నుంచి హరప్పా దాక - శ్లోకాలు, మంచి మాటలు
అహో! శిలే తే సౌభాగ్యం
య దహల్య కృతయుగే
సంస్కృతే రితిహాసస్య
సాక్షిభూతా సి సర్వదా
భావము: ఓ రాయీ! కృతయుగంలో నీవు అహల్యగా ఉన్నావు. ఎంత భాగ్యం నీది! సంస్కృతికి, ఇతిహాసానికీ కూడా ఎప్పుడూ సాక్షి గా ఉన్నావు
సారాసార పరిచ్ఛేత్తా
స్వామీభృత్యస్య దుర్లభః!
అనుకూల శ్శుచి ర్దక్షః
ప్రభోః భృత్యో పి దుర్లభః
భావము:భృత్యుని శక్తినీ, దౌర్బల్యాన్ని గుర్తించే యజమాని ఉండటం కష్టం. అలాగే అనుకూలుడు, మనసా వాచా కర్మణా పరిశుద్ధుడు, సమర్థుడు అయిన సేవకుడు యజమానికి దొరకడమూ కష్టమే
గురూన్ కుర్వంతి తే వంశ్యాన్
అన్వర్థా తై ర్వసుంధరా
యేషాం యశాంసి శుభ్రాణి
హ్రీపయంతీందు మండలం
భావము: వారి తెల్లని, నిష్కళంకమైన కీర్తి చంద్ర మండలాన్ని సిగ్గిల జేస్తుంది. వారివల్ల ఈ వసుంధర సార్థకనామధేయ అయింది. వారెవరు? వంశాలను, వంశాలలో పుట్టిన వారిని గొప్పగా చేసేవారే వారు!
త్యాగ ఏకో గుణః శ్లాఘ్యః
కిమన్యైః గుణరాశిభిః
త్యాగ జ్జగతి పూజ్యంతే
పశుపాషాణ పాదపాః
భావము: త్యాగ మొక్కటి చాలు - అదే పొగడదగిన గుణం. తక్కిన గుణాలు ఎందుకు? త్యాగం వల్లనే లోకంలో పశువులు, రాళ్ళు, చెట్లు పూజలందుకుంటున్నాయి